టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

దిశ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు అన్నెసత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని, వారి అభ్యున్నతి కోసం పనిచేయాలని కోరారు. ట్రైకార్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ కొందరు లంచాలు అడుగుతున్నారని, అలాంటి వాటిని ఎవరు నమ్మవద్దని తెలిపారు. అనంతనం టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, […]

Update: 2021-09-28 04:48 GMT

దిశ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు అన్నెసత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని, వారి అభ్యున్నతి కోసం పనిచేయాలని కోరారు. ట్రైకార్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ కొందరు లంచాలు అడుగుతున్నారని, అలాంటి వాటిని ఎవరు నమ్మవద్దని తెలిపారు. అనంతనం టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించారు.

అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వీళ్లే..

టీఆర్ఎస్ పార్టీ దుమ్ముగూడెం ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తెల్లం భీమరాజు, కార్యదర్శిగా కుంజా నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మోతుకూరి శ్రీకాంత్, కార్యదర్శిగా పాండుతూరి నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము రంజిత్ కుమార్, కార్యదర్శిగా బొల్లి శేఖర్, యూత్ సెల్ అధ్యక్షుడిగా లంక శివ, కార్యదర్శిగా అల్లాడి వెంకటేష్, మహిళా సెల్ అధ్యక్షురాలుగా మద్దుకూరి సంకీర్తి, కార్యదర్శి పూసం సావిత్రి, విద్యార్థి సెల్ అధ్యక్షుడిగా కొత్త వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా మడకం రంగబాబు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా సయ్యిద్ రహీమ్, కార్యదర్శిగా షేక్ ఖాదర్ భాషా, కార్మిక విభాగం అధ్యక్షుడిగా గంట్ల నరేష్, కార్యదర్శిగా సున్నం అంగమూర్తి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా దామెర్ల శ్రీనివాస్, కార్యదర్శిగా లోట రమేష్, రైతు విభాగం అధ్యక్షుడిగా నాగే వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా జోగా వెంకటరమణను నియమించినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెసత్యనారాయణ మూర్తి ప్రకటించారు.

Tags:    

Similar News