ఈటలపై చర్యలు తీసుకోండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కమలాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ నెం.262లో ఓటు వేయడానికి వెళ్ళిన ఈటల రాజేందర్, తన భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారని, ఓటర్లకు అప్పీల్ చేసే తీరులో విజ్ఞప్తి చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కమలాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ నెం.262లో ఓటు వేయడానికి వెళ్ళిన ఈటల రాజేందర్, తన భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారని, ఓటర్లకు అప్పీల్ చేసే తీరులో విజ్ఞప్తి చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదంటూ మీడియా ద్వారా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఆయన భార్య సైతం ధర్మం, న్యాయమే గెలుస్తుందంటూ పోలింగ్ బూత్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలిన బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని ఈటల రాజేందర్‌ను కట్టడి చేయాలని, ఆయనను ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడకుండా నియంత్రించాలని టీఆర్ఎస్ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.