స్పెషలిస్ట్ దొంగ.. పోలీస్ స్టేషన్ లే టార్గెట్
దిశ,పాలేరు: సాధారణంగా దొంగలు దొంగతనం ఎక్కడ చేస్తారు? బాగా డబ్బున్న వారి ఇళ్లలోనో.. నగల దుకాణంలోనో..అవి కుదరకపోతే రోడ్డు మీద వెళ్తున్న వారి దగ్గర గుట్టుగా పర్స్ లు కొట్టేసి దోచుకుంటారు. ఇలాంటి దొంగతనాలు అందరికి తెలిసినవే.. చాలా చోట్ల జరిగినవే. కానీ అందరిలా మనం చేస్తే మన ప్రత్యేకత ఏముందనుకున్నాడో ఏమో ఒక దొంగ.. ఏకంగా పోలీస్ స్టేషనలను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 40 దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను ముదిగొండ […]
దిశ,పాలేరు: సాధారణంగా దొంగలు దొంగతనం ఎక్కడ చేస్తారు? బాగా డబ్బున్న వారి ఇళ్లలోనో.. నగల దుకాణంలోనో..అవి కుదరకపోతే రోడ్డు మీద వెళ్తున్న వారి దగ్గర గుట్టుగా పర్స్ లు కొట్టేసి దోచుకుంటారు. ఇలాంటి దొంగతనాలు అందరికి తెలిసినవే.. చాలా చోట్ల జరిగినవే. కానీ అందరిలా మనం చేస్తే మన ప్రత్యేకత ఏముందనుకున్నాడో ఏమో ఒక దొంగ.. ఏకంగా పోలీస్ స్టేషనలను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 40 దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను ముదిగొండ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
తెలంగాణా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రలలో రాత్రి వేళ పలు దొంగతనాలకు పాల్పడుతున్న గుర్రం కోటేశ్వరరావు అనే అంతర్రాష్ట్ర దొంగను ముదిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా రోటరీనగర్ కు చెందిన గుర్రం కోటేశ్వరరావు ఖమ్మం పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీ పురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఎటువంటి అనుమతి పత్రాలు లేని 2 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం నిందితుడి వివరాలను రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేని వాహనంతో పట్టుబడ్డాడని,ఆ వాహనం ముదిగొండ పోలీస్ స్టేషన్ నుంచి దొంగిలించినట్లు గుర్తించామని తెలిపారు.అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ముదిగొండ,ఖమ్మం రూరల్ తో పాటు పలుపోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధరకాల 40 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని తెలిపారు.