డ్రగ్స్ కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఆ అవసరం ఎందుకొచ్చిందని నిలదీసింది. ఈ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు పై విధంగా స్పందించింది. డ్రగ్స్ కేసులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ […]

Update: 2021-04-29 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఆ అవసరం ఎందుకొచ్చిందని నిలదీసింది. ఈ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు పై విధంగా స్పందించింది. డ్రగ్స్ కేసులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.

రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదిస్తూ, రాష్ట్రంలో ఐదేళ్ళ క్రితం డ్రగ్స్ కేసు నమోదైందని, 2016 నుంచి ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీ సంస్థలకు అప్పగించలేదని వాదించారు. ఈడీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు తమకు వివరాలు ఇవ్వడం లేదని, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లు, నిందితుల వాంగ్మూలాలను ఇచ్చేలా రాష్ట్ర ఎక్సయిజ్ శాఖను ఆదేశించాలని కోరారు.

వాదలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈడీ కోరినట్లుగా డ్రగ్స్ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారి పేర్లు బైటకు రాకుండా దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని నిలదీసింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తీరును కూడా తప్పుపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News