తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేత
దిశ, భద్రాచలం : గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 11,552 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానికంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ అటవీప్రాంతం లోని వాగులు, వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్లోకి 13,886 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమైనారు. 70 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లో […]
దిశ, భద్రాచలం : గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 11,552 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానికంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ అటవీప్రాంతం లోని వాగులు, వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్లోకి 13,886 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమైనారు. 70 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లో 70.64 మీటర్ల నీటిని నిల్వచేస్తూ అదనపు నీటిని అవసరం మేరకు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.