దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
దిశ, తెలంగాణ బ్యూరో : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 లక్షల 46 వేల 822 మంది ఉన్నారన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అర్ధవంతమైన జీవనోపాధి పూర్తి భాగస్వామ్యం, వారి […]
దిశ, తెలంగాణ బ్యూరో : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 లక్షల 46 వేల 822 మంది ఉన్నారన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అర్ధవంతమైన జీవనోపాధి పూర్తి భాగస్వామ్యం, వారి హక్కుల పరిరక్షణ వంటి రంగాల్లో నూతన అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వికలాంగుల సాధికారత అమలుకు అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
సమాజంలో గౌరవ ప్రదమైన జీవితం కోసం, వికలాంగుల సాధికారతకు అవసరమైన శారీరక వైద్య, ఆర్థిక తదితర అంశాల్లో వారికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందన్నారు. సమాజంలో వారిపై ఉన్న వైఖరి, అవరోధానాలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దివ్యాంగులకు సంబంధించిన విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఎస్సీ, మైనార్టీ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమశాఖ అధ్యక్షతన రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేశామన్నారు.
దివ్యాంగులకు ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 3016 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ బి.శైలజ, తదితరులు పాల్గొన్నారు.