ఆ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ మినహాయింపు

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈ ఏడాది ఫైర్ ఎన్ఓసీకి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా బుధవారం జీవో విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా ప్రభావం విద్యారంగంపైనా పడింది. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా ఇంకా విద్యా సంస్థలను పున:ప్రారంభం కాలేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఫైర్ శాఖ నుంచి ఎన్ఓసీ మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. […]

Update: 2020-12-16 11:41 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈ ఏడాది ఫైర్ ఎన్ఓసీకి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా బుధవారం జీవో విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా ప్రభావం విద్యారంగంపైనా పడింది. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా ఇంకా విద్యా సంస్థలను పున:ప్రారంభం కాలేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఫైర్ శాఖ నుంచి ఎన్ఓసీ మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఏడాది మినహాయింపు ఇచ్చింది. దీనికి ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News