సీరంలో స్పుత్నిక్ ఉత్పత్తి.. తొలి బ్యాచ్ ప్రొడక్షన్ అప్పుడే..

న్యూఢిల్లీ: టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి దన్నునిచ్చేలా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) కీలక ప్రకటన చేసింది. పూణెలోని అతిపెద్ద టీకా తయారీసంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తి జరగనున్నట్టు వెల్లడించింది. సెప్టెంబర్‌లో తొలి బ్యాచ్ డోసులు బయటికి వస్తాయని వివరించింది. అంతేకాదు, యేటా 30 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయాలని సంకల్పిస్తున్నట్టు తెలిపింది. సీరంలో తమ టీకా ఉత్పత్తి కోసం టెక్నికల్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ […]

Update: 2021-07-13 06:17 GMT

న్యూఢిల్లీ: టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి దన్నునిచ్చేలా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) కీలక ప్రకటన చేసింది. పూణెలోని అతిపెద్ద టీకా తయారీసంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తి జరగనున్నట్టు వెల్లడించింది. సెప్టెంబర్‌లో తొలి బ్యాచ్ డోసులు బయటికి వస్తాయని వివరించింది. అంతేకాదు, యేటా 30 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయాలని సంకల్పిస్తున్నట్టు తెలిపింది. సీరంలో తమ టీకా ఉత్పత్తి కోసం టెక్నికల్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కొనసాగుతున్నదని ఆర్‌డీఐఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెల్, వెక్టార్ నమూనాలను సీరంకు పంపించామని వివరించింది. వీటి దిగుమతికి డీసీజీఐ ఇప్పటికే సీరం సంస్థకు అనుమతినిచ్చిందని పేర్కొంది. కల్టివేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. తమ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునే లక్ష్యాల్లో కీలక అడుగు పడిందని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ వివరించారు.

ఇండియా, సహా ప్రపంచదేశాల ప్రజలను కాపాడాలనే లక్ష్యంలో ఇతరులు భాగం కావాలనే తమ ఆలోచనలకు ఇది నిదర్శనమని తెలిపారు. సీరం సీఈవో అదర్ పూనావాలా ఈ డీల్‌పై స్పందించారు. ఆర్‌డీఐఎఫ్‌తో భాగస్వామ్యం కుదరడం సంతోషకరమని, వచ్చే నెలల్లో కోట్ల టీకాలను ఉత్పత్తి చేయాలనుకుంటున్నట్టు వివరించారు. ట్రయల్ బ్యాచ్‌లు సెప్టెంబర్‌లో మొదలవుతాయని తెలిపారు.

Tags:    

Similar News