సొంత తండ్రినే కడతేర్చిన కుమారుడు
దిశ, నల్లగొండ: తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారులే వారిని కాటికి పంపుతున్నారు. అల్లరిచిల్లరగా తిరిగే కుమారుల్ని పనిచేసుకోమని మందలించడమే వారి పాలిట శాపమవుతోంది. యుక్తవయసురాగానే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కర్కశంగా చంపేస్తున్నారు. ఖాళీగా తిరిగుతున్న ఓ కుమారుడిని పనిచేసుకోమని చెప్పినందుకు తండ్రి ఉసురు తీశాడు ఓ కుమారుడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన ఎల్లయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. […]
దిశ, నల్లగొండ: తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారులే వారిని కాటికి పంపుతున్నారు. అల్లరిచిల్లరగా తిరిగే కుమారుల్ని పనిచేసుకోమని మందలించడమే వారి పాలిట శాపమవుతోంది. యుక్తవయసురాగానే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కర్కశంగా చంపేస్తున్నారు. ఖాళీగా తిరిగుతున్న ఓ కుమారుడిని పనిచేసుకోమని చెప్పినందుకు తండ్రి ఉసురు తీశాడు ఓ కుమారుడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.
మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన ఎల్లయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎల్లయ్య కుమారుడు నాగేంధర్ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా పరీక్షలు కూడా రద్దు కావడంలో నాగేంధర్ ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎల్లయ్య తన కుమారుడిని ఏదైనా పనిచేసుకోవాల్సిందిగా చెబుతూ వస్తున్నాడు. కనీసం తనకు చేదోడు వాదోడుగా వ్యవసాయంలో సహాయం చేయమని గట్టిగా మందలించాడు. ప్రతిసారి తనను ఎందుకు పనిచేయమని చెబుతున్నావని తండ్రిపై కుమారుడు తాజాగా తిరగబడ్డాడు. మాటామాట పెరిగి క్షణికావేశంలో తండ్రిని కత్తితో పొడవడంతో ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తండ్రి మృతిచెందాడు. ఈ ఘటనతో భయపడి పారిపోతున్న నిందితుడిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. నాగేంధర్‌కు అప్పుడప్పుడు మతిస్తిమితం సరిగా ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.