ఆదిలాబాద్లో అద్భుతం.. అమ్మవారిని చుట్టుకున్న పాములు
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయ మరమ్మత్తులలో భాగంగా గుట్టను తవ్వుతుండగా అందులో పాములు బయటకు వచ్చాయి. ఆ పాములు పద్మావతి అమ్మ వారి చుట్టూ చుట్టుకొని ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. జిల్లాలో రెండవ తిరుపతి దేవస్థానంగా ఈ ఆలయం ప్రఖ్యాతి పొందుతోంది. ఈ క్రమంలో రోజు భక్తుల రాక పెరిగిపోవడంతో వారి సౌకర్యార్థం ఆలయ మరమ్మత్తుల పనులను […]
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయ మరమ్మత్తులలో భాగంగా గుట్టను తవ్వుతుండగా అందులో పాములు బయటకు వచ్చాయి. ఆ పాములు పద్మావతి అమ్మ వారి చుట్టూ చుట్టుకొని ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. జిల్లాలో రెండవ తిరుపతి దేవస్థానంగా ఈ ఆలయం ప్రఖ్యాతి పొందుతోంది. ఈ క్రమంలో రోజు భక్తుల రాక పెరిగిపోవడంతో వారి సౌకర్యార్థం ఆలయ మరమ్మత్తుల పనులను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్వామి వారి సన్నిధిలో కొలువుదీరిన పాములు బయటకు వచ్చి ఎటూ వెళ్లలేక పద్మావతి అమ్మవారి విగ్రహానికి చుట్టుకున్నాయి. దేవతా విగ్రహం వద్ద తలదాచుకుంటున్న ఆ పామును చూసి గ్రామస్తులు ఆశ్యర్య పోతున్నారు.