ఇద్దరు ఎమ్మెల్సీలకి శాసనసభ కార్యదర్శి నోటీసులు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ విప్ బుద్ధా వెంకన్న శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఎమ్మెల్సీలిద్దరికీ నోటీసులు జారీ చేశారు. జూన్ 3న మధ్యాహ్నం మూడు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.