రామమందిరం దేశ ఔన్నత్యానికి ప్రతీక

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణం, కరోనా నివారణకు కేంద్రప్రభుత్వం సమర్థమైన చర్యలు చేపట్టిందని అభినందిస్తూ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో రెండు కీలక తీర్మానాలు చేసిందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్, ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయూష్, కార్యవాహ కాచం రమేశ్ తెలిపారు. గురువారం గురువారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగళూరులో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాల్లో […]

Update: 2021-03-25 07:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణం, కరోనా నివారణకు కేంద్రప్రభుత్వం సమర్థమైన చర్యలు చేపట్టిందని అభినందిస్తూ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో రెండు కీలక తీర్మానాలు చేసిందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్, ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయూష్, కార్యవాహ కాచం రమేశ్ తెలిపారు. గురువారం గురువారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగళూరులో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాల్లో చర్చించిన, అనుసరించాల్సిన అంశాలను వెల్లడించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా మందిర నిర్మాణం కోసం 43 రోజుల పాటు చేపట్టిన నిధి సమర్పణ అభియాన్ విజయవంతమవవడం సంతోషకరమన్నారు. దేశవ్యాప్తంగా 60,867 కేంద్రాల్లో నిత్యం ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయని, రాష్ట్రంలోనూ 2,069 కేంద్రాల్లో 2,789 శాఖలు కొనసాగుతున్నాయని వివరించారు. భైంసాలో మతకలహాలు జరగలేదని, హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించారు.

Tags:    

Similar News