మహిళలపై వేధింపుల్లో వారే టాప్
ది, క్రైమ్ బ్యూరో : మహానగరంలో మహిళలపై వేధింపులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మహిళలు అత్యధికంగా మొబైల్ ఫోన్ల ద్వారానే వేధింపులకు గురవుతున్నారని పోలీసు శాఖ గణంకాలు చెబుతున్నాయి. వేధింపులకు గురయ్యే బాధితులు, వేధించే వారు ఇరువురిలోనూ అత్యధికంగా పెద్దలే అత్యధికంగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ పరిధిలో వేధింపుల కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. అక్టోబర్ నెలలో సైబరాబాద్ షీ టీం విభాగానికి 137 ఫిర్యాదు అందగా, అందులో 28 పెటీ కేసులు, 17 ఫిర్యాదులకు ఎఫ్ఐఆర్ చేసి […]
ది, క్రైమ్ బ్యూరో : మహానగరంలో మహిళలపై వేధింపులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మహిళలు అత్యధికంగా మొబైల్ ఫోన్ల ద్వారానే వేధింపులకు గురవుతున్నారని పోలీసు శాఖ గణంకాలు చెబుతున్నాయి. వేధింపులకు గురయ్యే బాధితులు, వేధించే వారు ఇరువురిలోనూ అత్యధికంగా పెద్దలే అత్యధికంగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ పరిధిలో వేధింపుల కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. అక్టోబర్ నెలలో సైబరాబాద్ షీ టీం విభాగానికి 137 ఫిర్యాదు అందగా, అందులో 28 పెటీ కేసులు, 17 ఫిర్యాదులకు ఎఫ్ఐఆర్ చేసి కేసులు నమోదు చేశారు. మరో 52 మందిని హెచ్చరించి వదిలేశారు. వీటిలో అత్యధికంగా 96 మంది మొబైల్ ఫోన్ ద్వారానే మహిళలను వేధించినట్టు పోలీసులు చెబుతున్నారు.
పెద్దలే వేధిస్తున్నారు..
మహిళలను వేధిస్తున్న వారిలో 18 ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా ఉంటున్నారు. సైబరాబాద్‌లో అక్టోబరులో అందిన 137 ఫిర్యాదుల్లో 56 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో ఇద్దరు మాత్రమే మైనర్లు కాగా, మిగతా అంతా మేజర్లే. ఆ 54 మందిలో 19 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు 46 మంది ఉన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు సైబరాబాద్ కమిషనరేట్ షీ టీం లకు 1664 ఫిర్యాదులు అందాయి. వీటిలో పెటీ కేసులు 282, ఎఫ్ఐఆర్ లు 165 అయ్యాయి. పోలీసులు హెచ్చరించిన వదిలేసిన 553 మందిలో 517 మంది 18 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు.
బస్టాండ్లు, పని ప్రదేశాల్లో వేధించడం, గృహహింస, సోషల్ మీడియా తదితర మార్గాల్లో వేధింపులకు గురైతే డయల్ 100 లేదా వాట్సాప్ 9490 617 444 నెంబరు ద్వారా ఫిర్యాదు చేయాలని షీ టీం డీసీపీ అనసూయ తెలిపారు.
ఏరియాల వారీగా నెంబర్లు..
బాలానగర్ – 94906 17349
మాదాపూర్ – 83339 95319
కూకట్ పల్లి – 94936 26811
జగద్గరిగుట్ట – 94936 24561
మియాపూర్ – 94910 51421
పేట్ బషీర్ బాద్ – 79011 14137
రాజేంద్రనగర్ – 79011 14140
శంషాబాద్ – 94906 17354
చేవేళ్ల – 94936 25379
sheteam.cyberabad@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
-
2020 జనవరి నుంచి అక్టోబరు వరకూ సైబరాబాద్ షీ టీంకు అందిన ఫిర్యాదులు – 1664. అందులో 282 పెటీ కేసులు పెట్టగా, 165 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ చేసి, రిమాండ్.
-
వార్నింగ్ ఇచ్చి వదిలేసిన 553 మందిలో 18 ఏళ్లకు పైబడిన వారు 517 మంది.
-
10 నెలల్లో 911 ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు 99,714 మంది హాజరు.