మెదక్ లో యువకుడిని కాపాడిన పోలీసులు

దిశ, మెదక్: వ్యవసాయ పొలం వద్ద పనుల్లో నిమగ్నమైన యువకుడిపై తేనెటీగలు దాడి చేయడంతో అటుగా వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన మంటను ఏర్పాటు చేసి.. మంట వద్దకు యువకుడిని తీసుకొచ్చి తేనెటీగల దాడి నుండి రక్షించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరును అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు అభినందించారు. విధుల నిమిత్తం కానిస్టేబుల్ పరుశరాములు […]

Update: 2020-06-16 04:22 GMT

దిశ, మెదక్: వ్యవసాయ పొలం వద్ద పనుల్లో నిమగ్నమైన యువకుడిపై తేనెటీగలు దాడి చేయడంతో అటుగా వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన మంటను ఏర్పాటు చేసి.. మంట వద్దకు యువకుడిని తీసుకొచ్చి తేనెటీగల దాడి నుండి రక్షించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరును అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు అభినందించారు. విధుల నిమిత్తం కానిస్టేబుల్ పరుశరాములు మరో కానిస్టేబుల్ తో కలిసి లింగుపల్లి గ్రామం వైపు వెళ్తున్నారు. వ్యవసాయ పొలం వద్ద యువకుడిపై తేనెటీగల దాడి చేయడంతో, ఆ యువకుడు అరుపులను విని అప్రమత్తమైన కానిస్టేబుల్ పరుశరాములు అక్కడే ఉన్న చెత్తాచెదారానికి మంట పెట్టి యువకుడిని మంట వద్దకు తీసుకువచ్చారు. పోలీసుల సాహసంతో తేనెటీగల దాడిలో స్వల్ప గాయాలతో బయట బయటపడ్డానని యువకుడు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు సమయానికి స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

Tags:    

Similar News