చలానా తప్పించుకునేందుకు.. రోడ్డుపై మహిళ చేసిన పనికి పోలీసులు షాక్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే, మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. సదరు మహిళకు పోలీసులు జరిమానా విధిస్తుండగా ఆమె.. పోలీసులను గందరగోళానికి గురిచేసింది. చలానాను తప్పించుకోవడానికి పోలీసుల ముందు పూనకం వచ్చినట్టు నటిస్తూ వింతగా ప్రవర్తించింది. ఒక్కసారిగా పూనకం వచ్చిన వారిలా […]

Update: 2021-06-10 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే, మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు.

సదరు మహిళకు పోలీసులు జరిమానా విధిస్తుండగా ఆమె.. పోలీసులను గందరగోళానికి గురిచేసింది. చలానాను తప్పించుకోవడానికి పోలీసుల ముందు పూనకం వచ్చినట్టు నటిస్తూ వింతగా ప్రవర్తించింది. ఒక్కసారిగా పూనకం వచ్చిన వారిలా డ్యాన్స్​ చేయడం మొదలుపెట్టింది. తనను అమ్మవారు పూనిందని.. ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నించింది. ఆమె వింత ప్రవర్తనను చూసి.. అనంతరం పోలీసులు మహిళను వదిలేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీ పట్టణంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News