దారుణం : రక్తపు మడుగుల్లో ఫొటోగ్రాఫర్.. అసలేం జరిగింది ?
దిశ, ఖానాపురం : ఖానాపురం మండల కేంద్రంలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానిక గ్రంథాలయం దగ్గరలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పులగం. రాజు (40) ఖానాపురం మండలంలో ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం అతని ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించే సరికే అప్పటికే చనిపోయాడు. తలపగిలి పోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో […]
దిశ, ఖానాపురం : ఖానాపురం మండల కేంద్రంలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానిక గ్రంథాలయం దగ్గరలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పులగం. రాజు (40) ఖానాపురం మండలంలో ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం అతని ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించే సరికే అప్పటికే చనిపోయాడు. తలపగిలి పోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులను సంప్రదించగా.. రాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవలు పడుతుండే వాడని అన్నారు. ఆదివారం అర్ధరాత్రి కూడా పీకల దాకా మద్యం తాగి భార్యతో గొడవ పడినట్లు సమాచారం ఉందన్నారు. ఈ క్రమంలో భయంతో అతని భార్య లావణ్య ఉన్నపళంగా దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. పొద్దున వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో రాజు పడి ఉండటం గమనించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు గడప మెట్లు ఎక్కుతూ గానీ, దిగుతూ గానీ మద్యం మత్తు కారణంగా తూలి గచ్చుపై పడటంతో తలకు గాయమై మృతి చెందొచ్చు అని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా పూర్తి విచారణ అనంతరం మృతికి గల అసలు కారణాలు బయటపెడతామని ఎస్సై సాయిబాబు అన్నారు. మృతునికి భార్య లావణ్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.