నీకేం పోయేకాలం రా బాబూ.. గాల్లో అన్ని కిలోమీటర్లు వచ్చావా ?

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అమెరికాలోకి వలసలు బాగా తగ్గిపోయాయి. వివిధ ఆంక్షల కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. అయితే వివిధ దేశాల నుంచి అమెరికాలో స్థిర పడాలి అనుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఎంతటి సాహసం అయినా చేసి అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి నివారించాలనే ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మెక్సికోకు అడ్డంగా గోడ కట్టాలని ప్రతిపాదించాడు. అయితే అమెరికాలో ఉండడానికి వీసా దొరకలేదో ఏమో గాని ఓ వ్యక్తి విచిత్రంగా […]

Update: 2021-11-29 04:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అమెరికాలోకి వలసలు బాగా తగ్గిపోయాయి. వివిధ ఆంక్షల కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. అయితే వివిధ దేశాల నుంచి అమెరికాలో స్థిర పడాలి అనుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఎంతటి సాహసం అయినా చేసి అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి నివారించాలనే ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మెక్సికోకు అడ్డంగా గోడ కట్టాలని ప్రతిపాదించాడు. అయితే అమెరికాలో ఉండడానికి వీసా దొరకలేదో ఏమో గాని ఓ వ్యక్తి విచిత్రంగా ఆలోచించి ఏకంగా విమానం టైర్ల పక్కన కూర్చుని 1,641 కి.మీ ప్రయాణించి అమెరికా చేరుకున్నాడు. అయితే అంత కష్టపడినా అతని అదృష్టం మాత్రం అడ్డం తిరిగింది.

విమానం ఆగగానే నేరుగా టైర్లలోంచి దిగి దర్జాగా నడిచి వచ్చాడు. అయితే ఇదంతా గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అతడిని పట్టుకుని ల్యాండింగ్ గేర్ లో అంత సేపు ఎలా ప్రయాణం చేశాడని విచారణ చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడి ఘనకార్యాన్ని వీడియో తీసిన ఆ సంస్థ ఇనిస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. గ్వాటెమాల సిటీ నుంచి ఈ విమానం మియామి నగరానికి వచ్చింది. ఆ వ్యక్తి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Tags:    

Similar News