అధికారులను నిర్బంధించిన రైతులు
దిశ, కరీంనగర్: పంటకు సరిపడా నీళ్లు అందిస్తామని చెప్పి.. చివరి నిమిషంలో సరఫరా చేయలేదని ఇరిగేషన్ అధికారులను రైతులు నిర్బంధించారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పంటపొలాలకు సాగునీరు ఇవ్వడం లేదని రైతులు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా అసలు పంటలే ఎండిపోలేదని కొట్టిపారేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ […]
దిశ, కరీంనగర్: పంటకు సరిపడా నీళ్లు అందిస్తామని చెప్పి.. చివరి నిమిషంలో సరఫరా చేయలేదని ఇరిగేషన్ అధికారులను రైతులు నిర్బంధించారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పంటపొలాలకు సాగునీరు ఇవ్వడం లేదని రైతులు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా అసలు పంటలే ఎండిపోలేదని కొట్టిపారేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ అధికారులను సూరయ్యపల్లె గ్రామానికి పంపారు. అయితే, పంటలు ఎండిపోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులు ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో పంటకు సరిపడా నీరిస్తామంటేనే సాగు చేస్తున్నామని, చివరి దశకు వచ్చాక నీరు అందకపోవడంతో చేతికొచ్చే దశలో పంట అంతా నాశనం అయిందని రైతులు అధికారులను నిలదీశారు. దాదాపు గంట సేపు అధికారులను నిర్బంధించారు. అనంతరం మళ్లీ నీరు వదిలేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు వారిని వదిలేశారు
tag:Farmers, blocked, Irrigation, authorities, peddapalli