కూలీలపై పత్తిమిల్లు యజమాని అమానుషం
వరంగల్: పొట్టకూటి కోసం వలస వచ్చి కూలి పని చేసుకుంటున్న వారిపై పత్తిమిల్లు యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చి ఓ పత్తిమిల్లులో పనిచేసుకుంటున్న కూలీలను యజమాని గెంటివేశాడు. లాక్‌డౌన్ వేళ.. పని దొరక్కపోవడంతో ఐదురోజులుగా పస్తులుంటున్నామని కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండటానికి ఆశ్రయం లేక బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే గడుపుతున్నామంటూ వాపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూలీలకు ఆశ్రయం కల్పించారు. […]
వరంగల్: పొట్టకూటి కోసం వలస వచ్చి కూలి పని చేసుకుంటున్న వారిపై పత్తిమిల్లు యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చి ఓ పత్తిమిల్లులో పనిచేసుకుంటున్న కూలీలను యజమాని గెంటివేశాడు. లాక్‌డౌన్ వేళ.. పని దొరక్కపోవడంతో ఐదురోజులుగా పస్తులుంటున్నామని కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండటానికి ఆశ్రయం లేక బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే గడుపుతున్నామంటూ వాపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కూలీలకు ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో తమను స్వస్థలాలకు పంపించాలని కూలీలు పోలీసులను వేడుకుంటున్నారు.
Tags: owner, worker, cotton mill, warangal, police, uttar pradesh, bihar