ఇన్ఫోసిస్ భారీ ఒప్పందం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాకు చెందిన ఫండ్ ఏజెన్సీ వ్యాన్‌గార్డ్ నుంచి విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుందని సమాచారం. కొవిడ్-19 వ్యాప్తీ సమయంలో ఇది భారీ ఒప్పందం. పదేళ్ల కాలం వరకూ సర్వీసులను పొడిగించే వీలున్న ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 11,500 కోట్లని అంచనా. అప్పటికి ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 14 వేల కోట్లకు చేరే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ 2020-21 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాకు చెందిన ఫండ్ ఏజెన్సీ వ్యాన్‌గార్డ్ నుంచి విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుందని సమాచారం. కొవిడ్-19 వ్యాప్తీ సమయంలో ఇది భారీ ఒప్పందం. పదేళ్ల కాలం వరకూ సర్వీసులను పొడిగించే వీలున్న ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 11,500 కోట్లని అంచనా. అప్పటికి ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 14 వేల కోట్లకు చేరే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూ ఈ త్రైమాసికంలో 1.7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదురినట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, వ్యాన్‌గార్డ్‌తో చేసుకున్న ఒప్పందం ఇందులో లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ఇన్ఫోసిస్ ఇప్పటివరకు చేసుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్దది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు ఈ ఒప్పందం విలువ ఒక బిలియన్ లోపు ఉంటుందని అంచనా వేశారు. వారం క్రితం షేర్ విలువ భారీగా పుంజుకోవడం కూడా ఈ ఒప్పందం అంచనాలకు కారణమని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఇంకా స్పందించాల్సి ఉంది. తొలి త్రైమాసిక ఫలితాల అనంతరం ఒప్పందాల గురించి తెలిసిన తర్వాతే ఇన్ఫోసిస్ షేర్లు దూకుడు పెంచాయి. తాజాగా వ్యాన్‌గార్డ్ ఒప్పందం విషయంలో ఇతర ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, టీసీఎస్, విప్రోలు కూడా పోటీ పడ్డాయని సమాచారం. చివరికి ఇది ఇన్ఫోసిస్‌కు దక్కింది. ఈ ఒప్పందం ప్రకారం బీపీఎం సేవలతో పాటు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసులను ఇన్ఫోసిస్ అందించనుంది.