మానవత్వం మంటగలిసింది.. పింఛన్ డబ్బుల కోసం తల్లిని అలా చేసిన కొడుకు..
దిశ, పరిగి : నేటి సమాజం తలదించుకునేలా చేసాడో కొడుకు. పింఛన్ డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఈ విషాదకర సంఘటన పరిగి మండలం ఖుదావంద్పూర్గ్రామంలో చోటు చేసుకుంది. పరిగి ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల.. ఖుదావంద్పూర్గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బల్వంత్ మద్యంకు బానిసై ఊరిలో పనిపాట లేకుండా తిరుగుతుండేవాడు. పెళ్లి చేస్తే మద్యం మానేసి బాగుపడుతాడని నమ్మి కొన్నేళ్ల క్రితం బల్వంత్‌కు రమాదేవితో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు […]
దిశ, పరిగి : నేటి సమాజం తలదించుకునేలా చేసాడో కొడుకు. పింఛన్ డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఈ విషాదకర సంఘటన పరిగి మండలం ఖుదావంద్పూర్గ్రామంలో చోటు చేసుకుంది. పరిగి ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల.. ఖుదావంద్పూర్గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బల్వంత్ మద్యంకు బానిసై ఊరిలో పనిపాట లేకుండా తిరుగుతుండేవాడు. పెళ్లి చేస్తే మద్యం మానేసి బాగుపడుతాడని నమ్మి కొన్నేళ్ల క్రితం బల్వంత్‌కు రమాదేవితో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బల్వంత్ తీరులో ఎలాంటి మార్పు రాకపోగా భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మద్యానికి డబ్బులు కావాలంటూ వేధించడంతో భార్య బల్వంత్ నుంచి రెండేళ్ల క్రింతం ఇద్దరు కుమారులను తీసుకొని తల్లి గారింటికి వెళ్లిపోయింది. పనిబాట లేకపోవడంతో తల్లి ఎర్రోళ్ల భీమమ్మ (55) పింఛన్ డబ్బులు తీసుకొని తాగడం మొదలు పెట్టాడు.
బల్వంత్ తీరుతో విసుగుచెందిన భీమమ్మ పింఛన్ డబ్బులు ఇవ్వనంటూ శుక్రవారం గొడవపడింది. తాగేందుకు డబ్బులు ఇవ్వవా అంటూ శుక్రవారం రాత్రి కరెంటు వైరుతో భీమమ్మ గొంతు బిగించి హత్య చేశాడు. ఉదయం ఇరుగుపొరుగు భీమమ్మ ఎందుకు లేవలేదంటూ వచ్చి చూసే సరికి చనిపోయి ఉంది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని భీమమ్మ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. నిందితుడు బల్వంత్‌ను విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు. మృతు రాలి చెల్లలు రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.