సీఆర్‌పీఎఫ్‌కు సర్వోత్తమ ట్రోఫీ

దిశ, వెబ్ డెస్క్: అఖిల భారత పోలీసుల బ్యాండ్ పోటీల్లో సర్వోత్తమ ట్రోఫీని.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఆర్‌పీఎఫ్‌కు ప్రదానం చేశారు. 20వ అఖిల భారత పోలీసుల బ్యాండ్ పోటీల ముగింపు ఉత్సవం.. ఆదివారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే సర్వోత్తమ ట్రోఫీని సీఆర్‌పీఎఫ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతం అనేది […]

Update: 2020-02-23 09:46 GMT

దిశ, వెబ్ డెస్క్: అఖిల భారత పోలీసుల బ్యాండ్ పోటీల్లో సర్వోత్తమ ట్రోఫీని.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఆర్‌పీఎఫ్‌కు ప్రదానం చేశారు. 20వ అఖిల భారత పోలీసుల బ్యాండ్ పోటీల ముగింపు ఉత్సవం.. ఆదివారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే సర్వోత్తమ ట్రోఫీని సీఆర్‌పీఎఫ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతం అనేది దివ్యత్వమన్నారు. ప్రజల హృదయాలను, మనస్సును సమానంగా ఆకర్షించే శక్తి సంగీతానికి ఉందన్నారు. అది మనిషిలోని ఉత్తమ తత్వాన్ని వెలికితీస్తుందని.. సాయుధ బలగాల్లో సాహస పరాక్రమాలను తట్టిలేపుతుందని వెంకయ్య వివరణ ఇచ్చారు. అంతకు ముందు ఆయన ఆర్‌పీఎఫ్ పనితీరును వివరించే కాఫీ టెబుల్ బుక్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Read also..

బుక్‌లెట్‌ల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం

Full View

Tags:    

Similar News