లాడ్జీలో మైనర్‌పై అత్యాచారం.. ఇంటి ముందే వదిలేసి వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్‌ను పేరెంట్స్ వద్దకు తీసుకెళ్తానన్న యజమాని దారుణానికి ఒడిగట్టాడు. మార్గమధ్యలో ఓ లాడ్జీకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం రేపింది. అసలేం జరిగిందంటే..! పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ దంపతులు పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేస్తుండేవారు. వారి కూతురిని(14) థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం […]
దిశ, వెబ్‌డెస్క్: తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్‌ను పేరెంట్స్ వద్దకు తీసుకెళ్తానన్న యజమాని దారుణానికి ఒడిగట్టాడు. మార్గమధ్యలో ఓ లాడ్జీకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం రేపింది.
అసలేం జరిగిందంటే..!
పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ దంపతులు పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేస్తుండేవారు. వారి కూతురిని(14) థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని మైనర్‌ను నమ్మించిన ఇంటి యజమాని టూవీలర్‌పై అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. బాలికను బెదిరించడమే కాకుండా.. దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్నాడు. అనంతరం బాధితురాలిని తల్లిదండ్రుల వద్ద వదిలేశాడు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని మైనర్ పేరెంట్స్‌కు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.