హరితవనంలో సఫారీ నడిపిన మంత్రి

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని గండిరామన్న హరితవనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హరితవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోటింగ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేగాకుండా హరితవనం ప్రారంభం అనంతరం వనంలో మంత్రి సఫారీ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం నిర్మల్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేగాకుండా కోతులకు కుటుంబ నియంత్రణ చేసి అడవుల్లో వదిలేస్తాం అని […]

Update: 2020-12-20 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని గండిరామన్న హరితవనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హరితవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోటింగ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేగాకుండా హరితవనం ప్రారంభం అనంతరం వనంలో మంత్రి సఫారీ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలోనే తొలి కోతుల సంరక్షణ కేంద్రం నిర్మల్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేగాకుండా కోతులకు కుటుంబ నియంత్రణ చేసి అడవుల్లో వదిలేస్తాం అని వెల్లడించారు. పర్యావరణ సమతుల్యం ద్వారానే మానవజాతి మనుగడ సాధిస్తుందని తెలిపారు.

Tags:    

Similar News