లేగ దూడకు గాయం... పులి దాడి చేసినట్టు ప్రచారం

మండలంలోని నీలాయపల్లి గ్రామ సమీపంలో కుంట వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెడ మీద గాయంతో విలవిలాడుతున్న లేగ దూడను స్థానిక యువకులు చూశారు.

Update: 2024-12-24 16:30 GMT

దిశ, తాండూర్ : మండలంలోని నీలాయపల్లి గ్రామ సమీపంలో కుంట వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెడ మీద గాయంతో విలవిలాడుతున్న లేగ దూడను స్థానిక యువకులు చూశారు. లేగ దూడ మెడ మీద పై ఉన్న గాయాన్ని బట్టి పులి లేదా చిరుత పులి దాడి చేసి ఉండొచ్చునని యువకులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని ప్రచారం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లేగ దూడపై పులి దాడి చేసిందా? లేదా మరేదైనా జంతువు దాడి చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.


Similar News