సాఫ్ట్ బేస్ బాల్ క్రీడలు రాష్ట్రనికే గర్వకారణం
సాఫ్ట్ బేస్ బాల్ క్రీడలు రాష్ట్రానికే గర్వకారణం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
దిశ, బెల్లంపల్లి : సాఫ్ట్ బేస్ బాల్ క్రీడలు రాష్ట్రానికే గర్వకారణం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్లో సాఫ్ట్ బేస్ బాల్ 9వ అండర్ 14 యూత్ జాతీయ పోటీలు సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పులియాల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సాఫ్ట్ బేస్ బాల్ జాతీయ పోటీలు బెల్లంపల్లిలో నిర్వహించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పులియాల రవికుమార్ ఆధ్వర్యంలో జాతీయ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ జాతీయ పోటీలకు దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 400 మంది క్రీడాకారులు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.