వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

దిశ, మేడ్చల్: వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం చౌదరిగూడ గ్రామంలో వికలాంగులకు బియ్యం, నిత్యవసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. స్వీయ నియంత్రణతో కరోనాను కట్టడి చేయవచ్చునని, కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనావైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ.. పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప, బయటకు రావద్దని, […]

Update: 2020-06-01 08:07 GMT

దిశ, మేడ్చల్: వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం చౌదరిగూడ గ్రామంలో వికలాంగులకు బియ్యం, నిత్యవసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. స్వీయ నియంత్రణతో కరోనాను కట్టడి చేయవచ్చునని, కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనావైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ.. పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప, బయటకు రావద్దని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని వారిని అభినందించారు.

Tags:    

Similar News