భార్యకు పిల్లలు పుట్టారని.. మరో అమ్మాయితో ప్రేమాయణం
దిశ, వెబ్ డెస్క్ : మనసుకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక వేరే అమ్మాయిపై మనసు పడ్డాడు ఓ వ్యక్తి. మాయమాటలు చెప్పి తనని ప్రేమ బరిలోకి దించాడు. అతను చెప్పిన మాయమాటలు నమ్మిన ఆ యువతి అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. అలానే అతడితో సహజీవనం చేసింది. కొంత కాలం తర్వాత తన ప్రవర్తన , మాటలపై అనుమానం వచ్చింది. యువతి అతడిని నిలదీయగా తనకు పెళ్లైందని నిజం చెప్పాడు. […]
దిశ, వెబ్ డెస్క్ : మనసుకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక వేరే అమ్మాయిపై మనసు పడ్డాడు ఓ వ్యక్తి. మాయమాటలు చెప్పి తనని ప్రేమ బరిలోకి దించాడు. అతను చెప్పిన మాయమాటలు నమ్మిన ఆ యువతి అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. అలానే అతడితో సహజీవనం చేసింది. కొంత కాలం తర్వాత తన ప్రవర్తన , మాటలపై అనుమానం వచ్చింది. యువతి అతడిని నిలదీయగా తనకు పెళ్లైందని నిజం చెప్పాడు. నిజం తెలుసుకున్న యువతి తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా తీసుకురావలనుకున్న అతను కిడ్నాప్ కు వ్యూహం రచించాడు. అదే విధంగా ఆమె సొంత ఊరుకి వెళ్లి కిడ్నాప్ కి యత్నించాడు ఆ సమయంలోనే గ్రామస్తులకు అడ్డంగా దొరికి పోయాడు.
వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన బత్తుల రవికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు స్థానికంగా పత్తి, మిరప వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో నకరికల్లు మండలానికి చెందిన యువతితో పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తూ ఆరేళ్లగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఐతే రవికి పెళ్లైన విషయం యువతికి తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రవి యువతిని చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది.
దీంతో ఆమెపై మరింత కక్ష పెంచుకున్న రవి.. ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీ రాత్రి కారులో తన మిత్రులతో కలిసి యువతి ఉంటున్న గ్రామానికి వెళ్లాడు. ఆయువతిని బయిటికి పిలిచి అర్ధరాత్రి ఆమెను బలవంతంగా తీసుకొచ్చి కారెక్కించేందుకు యత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి రవితో పాటు మరో ఇద్దర్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. రవితో పాటు ఇనిమెళ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్, రామిశెట్టి తిరుమలరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.