“బూబీ ట్రాప్” లను అమర్చిన మావోయిస్టులు.. వారికోసమేనా ?
దిశ, ఏపీ బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు బూబీ ట్రాప్ లు అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలోయాంటీ నక్సల్ స్క్వాడ్, సీఆర్పీఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే మావోయిస్టులు వారి వ్యూహాత్మక దాడులలో ఒకటిగా భావించే బూబీ ట్రాప్‌లను భద్రతా బలగాలు గుర్తించాయి. 10 బూబీ ట్రాప్‌లను భద్రతా బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. భూమిలో పది అడుగుల లోతు వరకు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు బూబీ ట్రాప్ లు అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలోయాంటీ నక్సల్ స్క్వాడ్, సీఆర్పీఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే మావోయిస్టులు వారి వ్యూహాత్మక దాడులలో ఒకటిగా భావించే బూబీ ట్రాప్‌లను భద్రతా బలగాలు గుర్తించాయి. 10 బూబీ ట్రాప్‌లను భద్రతా బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. భూమిలో పది అడుగుల లోతు వరకు కందకాలను తవ్వి దానిలో వెదురు బొంగులను బాణాల మాదిరిగా సూది మొనలవలె చెక్కి, ఆకులు అలములతో కప్పేశారు. కూంబింగ్‌కు వచ్చే భద్రత బలగాలను దెబ్బతీసేందుకు ఈ బూబీ ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేసినట్లు చింతూరు ఏఎస్పీ జీ కృష్ణకాంత్ అన్నారు. ప్రస్తుతం ఈ బూబీ ట్రాప్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపారు.