ప్రభుత్వానికి మావోయిస్టు కమిటీ సూటి ప్రశ్న
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ది అంతా పెడ్డుబడిదారులు, సామ్రాజ్యవాదులకు మాత్రమే చేరుతోందని సామాన్యుడికి మాత్రం అందనంత దూరంలో ఉందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సామ్రాజ్యవాద కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించడమే అభివృద్ది జరిగినట్టా అని ఆయన ప్రశ్రించారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎన్ని టీఎంసీల నీరందించారో చెప్పాగలరా, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట నిర్వాసితులను చేయడం అభివృద్ది ఎలా అవుతుందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ది అంతా పెడ్డుబడిదారులు, సామ్రాజ్యవాదులకు మాత్రమే చేరుతోందని సామాన్యుడికి మాత్రం అందనంత దూరంలో ఉందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సామ్రాజ్యవాద కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించడమే అభివృద్ది జరిగినట్టా అని ఆయన ప్రశ్రించారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎన్ని టీఎంసీల నీరందించారో చెప్పాగలరా, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట నిర్వాసితులను చేయడం అభివృద్ది ఎలా అవుతుందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందని ప్రకటించిన ప్రభుత్వం దళారులను ప్రోత్సహించి రైతులకు తీరని అన్యాయం చేసిందన్నారు. అభివృద్ది నిరోధకులే అభివృద్ది గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మహేష్ వ్యాఖ్యానించారు. ప్రజల మౌళిక సౌకర్యాల కోసం త్యాగాలు చేస్తున్న మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకుని డీజీపీ బురద జల్లుతున్నారని ఆరోపించారు. మావోయిస్టు అగ్ర నేతలు విలసవంతంగా జీవిస్తున్నారని డీజీపీ ఆరోపించడం పచ్చి బూటకమన్నారు. మావోయిస్టు పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేందుకు, ప్రజలకు పార్టీని దూరం చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మహేష్ అన్నారు.