కొవిడ్ మృతునికి సొంత ఖర్చులతో అంత్యక్రియలు
దిశ ప్రతినిధి, మెదక్: కరోనాతో మృతి చెందిన వ్యక్తికి ముస్లిం యువకులు తమ స్వంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిండంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండావెళ్లి గ్రామానికి చెందిన వృద్ధుడు గట్టు బాలస్వామి కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ముస్లిం యువకులు సోహెల్, హాజీ, పర్వేజ్, అబ్బాస్, అతీక్, మహిలు పెద్దగుండావెళ్లి గ్రామానికి వెళ్లి తమ స్వంత ఖర్చులతో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. […]
దిశ ప్రతినిధి, మెదక్: కరోనాతో మృతి చెందిన వ్యక్తికి ముస్లిం యువకులు తమ స్వంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిండంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండావెళ్లి గ్రామానికి చెందిన వృద్ధుడు గట్టు బాలస్వామి కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ముస్లిం యువకులు సోహెల్, హాజీ, పర్వేజ్, అబ్బాస్, అతీక్, మహిలు పెద్దగుండావెళ్లి గ్రామానికి వెళ్లి తమ స్వంత ఖర్చులతో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనాతో పేద కుటుంబానికి చెందిన వారెవరైనా మృతి చెందిన సమాచారం తమకు అందిస్తే వారి అంత్యక్రియలు తాము తమ స్వంత ఖర్చులతో నిర్వహిస్తామని చెప్పారు. సమాచారం అందించాలనుకునే వారు సోహెల్ (9160410312), హాజీ (9390909912), పర్వేజ్ ( 6302658476), అబ్బాస్ ( 7288028556), అతీక్ ( 9652652127), మహి (9030958678) నంబర్లకి ఫోన్ చేయగలరని తెలిపారు.