కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని, కరోనాతో వేల మంది చనిపోయినా ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదలకు అందాల్సిన ఉచిత వైద్యాన్ని అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. ఎవరెక్కడ చచ్చినా, తను మాత్రం ఎన్నికల్లోచావకూడదని సీఎం భావిస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాల కోసం రూ.వంద కోట్లు కూడా ఖర్చుపెట్టని కేసీఆర్, హుజురాబాద్ ఉప […]

Update: 2021-08-29 07:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని, కరోనాతో వేల మంది చనిపోయినా ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదలకు అందాల్సిన ఉచిత వైద్యాన్ని అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. ఎవరెక్కడ చచ్చినా, తను మాత్రం ఎన్నికల్లోచావకూడదని సీఎం భావిస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాల కోసం రూ.వంద కోట్లు కూడా ఖర్చుపెట్టని కేసీఆర్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను, భూములు లాక్కొని రైతులను, వైద్యం అందించకుండా పేదలను ముఖ్యమంత్రి చంపుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటే మీ ఒక్క కుటుంబం చల్లగా బతికితే చాలా దొరా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన టేబుల్‌ టెన్నీస్ క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ కు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఆమె పోరాడిన తీరు అద్భుతమని, యావత్ దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News