ఆ లేఖ లోకేశ్ ఆధ్వర్యంలో తయారైందే: లక్ష్మీ పార్వతి
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో తయారైనదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ లేఖపై దుమారం రేగిన ఆరంభంలో రమేష్ కుమార్ ఆ లేఖను తాను రాయలేదని ఒక జాతీయ ఛానెల్‌తో అన్నారని గుర్తుచేశారు. ఆయన రాయకపోతే ఎవరు రాశారో దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను కోరడంతో తానే రాశానని ఆయన […]
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో తయారైనదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ లేఖపై దుమారం రేగిన ఆరంభంలో రమేష్ కుమార్ ఆ లేఖను తాను రాయలేదని ఒక జాతీయ ఛానెల్‌తో అన్నారని గుర్తుచేశారు. ఆయన రాయకపోతే ఎవరు రాశారో దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను కోరడంతో తానే రాశానని ఆయన బుకాయించారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ బాబుకి రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.
ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందేనని ఆయన మాటలు చూస్తే అర్ధమవుతుందని ఆమె అన్నారు. ఈ లేఖ నారా లోకేశ్ ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకుందని ఆమె చెప్పారు. అలా కాకుండా రమేశ్ కుమార్ తన కార్యాలయం నుంచే రాసి ఉంటే… ఆ వివరాలను ల్యాప్ టాప్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? అని ఆమె నిలదీశారు. దీనిపై సీఐడి అధికారుల ముందు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తి వివరించారని ఆమె వెల్లడించారు.
Tags: nimmagadda ramesh kumar, ex-sec, laxmi parvathi, ysrcp