నిజామాబాద్‌లో అమానుషం.. ఆడపిల్లలు పుట్టారని ఆ భర్త భార్యను ఏం చేశాడంటే..!

దిశప్రతినిధి, నిజామాబాద్ : ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడో భర్త.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రహదారిని ఆనుకుని ఉన్న బ్యాంక్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు సంధ్య, కూతురు, మహిళ సంఘాలతో కలిసి బుధవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వివరాల్లోకివెళితే.. అర్యనగర్‌కు చెందిన సందీప్‌కు 2015లో ఆర్మూర్‌కు చెందిన సంధ్యను ఇచ్చి వివాహం జరిపించారు వీరి కుటుంబీకులు.. కొన్నాళ్లు […]

Update: 2021-10-27 05:32 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడో భర్త.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రహదారిని ఆనుకుని ఉన్న బ్యాంక్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు సంధ్య, కూతురు, మహిళ సంఘాలతో కలిసి బుధవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వివరాల్లోకివెళితే.. అర్యనగర్‌కు చెందిన సందీప్‌కు 2015లో ఆర్మూర్‌కు చెందిన సంధ్యను ఇచ్చి వివాహం జరిపించారు వీరి కుటుంబీకులు.. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో అనుకోకుండా మనస్పర్దలు వచ్చాయి. కారణం వీరికి ఆడపిల్లలు జన్మించడమే.

ఇద్దరు కూతుర్లే కావడంతో మగపిల్లలను ఎందుకు కనలేదని సందీప్ భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు. చివరకు భార్యను ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట తన పిల్లలతో పాటు మహిళ సంఘాలతో కలిసి బాధితురాలు ఆందోళనకు దిగింది. ఏడాదిన్నర కిందట భర్త, అత్తమామలపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు కూడా సంధ్య తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుండగా సంధ్య మహిళా సంఘాలను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరడంతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళ సంఘాల నాయకులు సందీప్ ఇంట్లోకి వారి తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News