అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వసలవెళ్లి వచ్చిన యువకుడు అప్పుల బాధలు తాళలేక గడ్డి మందు తాగి మృతి చెందాడు.
దిశ, కోనరావుపేట : ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వసలవెళ్లి వచ్చిన యువకుడు అప్పుల బాధలు తాళలేక గడ్డి మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దూస వెంకటేష్ (34) గత వారం రోజుల క్రితం గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూస వెంకటేష్ - సంధ్య దంపతులు. వెంకటేష్ కుటుంబ పోషణ భారం కావడంతో ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకు దెరువుకోసం గత 6 నెలల క్రితం పరాయి దేశం వలస వెళ్లి పని లేక మోసపోయి తిరిగి స్వదేశం వచ్చాడు.
కుటుంబ పోషణ కోసం వేములవాడ లోని ఓ బట్టల షాప్ లో జీతానికి కుదిరి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా గల్ఫ్ వెళ్లడానికి అప్పులు ఎక్కువ కావడంతో తీర్చే దారి తెలియక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వెంకటేష్ కి భార్య సంధ్య, కూతురు నిత్యాశ్రీ (4), నయన శ్రీ (1) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.