హార్వెస్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని చండ్రుపల్లి వద్ద గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య సంఘటనను పోలీసులు ఛేదించారు.

Update: 2024-11-29 15:47 GMT

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని చండ్రుపల్లి వద్ద గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య సంఘటనను పోలీసులు ఛేదించారు. కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన హార్వెస్టర్ యజమాని ముత్యాల శ్రీకాంత్ గౌడ్ ను బుధవారం రోజు సాయంత్రం సమయంలో చంద్రుపల్లి వద్ద కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో కేసు నమోదు చేసుకుని, కాళేశ్వరం, మహాదేవపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తూ ముగ్గురు నిందితులు శివ కృష్ణ గౌడ్, ఎం ఫయాజ్, కురుమ సాయి కిరణ్ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు కాటారం నుండి ఎస్పి జి రామ్ మోహన్ రెడ్డి శుక్రవారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. “ విచారించగా పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన పొన్నం శివకృష్ణ గౌడ్ అనే వ్యక్తి తన స్వగ్రామంలో వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు కలరు. అతని భార్య వడ్డీలకు డబ్బులు ఇస్తుంటుంది.

ఈ క్రమంలో తన భార్య సోదరుడి స్నేహితుడైన ముత్యాల శ్రీకాంత్ కు ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండటంతో భర్త శివకృష్ణకు భార్యపై అనుమానం కలిగి భార్యను శ్రీకాంత్ ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా వినకుండా తరచుగా ఫోన్లో మాట్లాడడంతో శ్రీకాంత్ ని ఎలాగైనా చంపాలనే ఆలోచనతో తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎండి ఫయాజ్ కు విషయం తెలిపారు. కొమ్మెర గ్రామానికి చెందిన కురుమ సాయికిరణ్ తో స్నేహం ఏర్పరచుకొని శ్రీకాంత్ కదలికలు తెలుసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం శివకృష్ణ, ఫయాజ్ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పై కొమ్మెర గ్రామానికి వచ్చి శ్రీకాంత్ కోసం రెక్కి నిర్వహించారు. ఇంట్లో లేడని తెలుసుకున్న నిందితులు, సాయి, కిరాణా షాప్ వద్ద శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకొని అక్కడే మద్యం తీసుకొని చండ్రుపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీకాంత్ వద్దకు చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపి వేశారు.

ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వెంటనే స్పందించిన పోలీసులు పొన్నం శివకృష్ణ గౌడ్,ఎండి ఫయాజ్.,కురుమ సాయి కిరణ్, నిందితులను అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద కత్తి, రక్తం అంటిన బట్టలు, హెల్మెట్, రెండు మొబైల్ ఫోన్లు.స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.” ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సీఐ రామ్ చందర్రావు, కాళేశ్వరం ఎస్సై చక్రపాణి, మహదేపూర్ ఎస్సై పవన్ కుమార్, పలిమెల ఎస్సై తమాషా రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్స్ బాల్ సింగ్, శ్యామ్, అన్వేష్, ధనుంజయ్, కిషన్, హోంగార్డ్స్ లింగ బాబు, శంకర్ స్వామి, వజీర్ బాపు వారి సిబ్బంది పాల్గొన్నారు.


Similar News