దానికోసం ఏకంగా భార్యనే తాకట్టు పెట్టిన భర్త..!
దిశ, వెబ్ డెస్క్: అప్పుడెప్పుడో జూదంలో ధర్మరాజు భార్యను పెట్టి ఓడిపోయాడని చదువుకున్నాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. బతుకుతెరువు కోసం ఢిల్లీకి వచ్చారు ఇద్దరు దంపతులు. అయితే జూదాలకు అలవాటు పడిన భర్త సర్వస్వం కోల్పోయి భార్యను జూదంలో పెట్టాడు. ఆమెను కూడా ఓడి పోవడంతో ఆమెను అక్కడే వదిలేసి తన స్వంత జిల్లా అయిన బలియాకు చేరుకున్నాడు. దేవుని దయవల్ల ఎలాగోలా బయట పడిన ఆ మహిళ ఇంటికి […]
దిశ, వెబ్ డెస్క్: అప్పుడెప్పుడో జూదంలో ధర్మరాజు భార్యను పెట్టి ఓడిపోయాడని చదువుకున్నాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. బతుకుతెరువు కోసం ఢిల్లీకి వచ్చారు ఇద్దరు దంపతులు. అయితే జూదాలకు అలవాటు పడిన భర్త సర్వస్వం కోల్పోయి భార్యను జూదంలో పెట్టాడు. ఆమెను కూడా ఓడి పోవడంతో ఆమెను అక్కడే వదిలేసి తన స్వంత జిల్లా అయిన బలియాకు చేరుకున్నాడు.
దేవుని దయవల్ల ఎలాగోలా బయట పడిన ఆ మహిళ ఇంటికి వచ్చింది. అయితే జూదంలో 2 లక్షలు నీ వల్లే పోయాయి, వెల్లి నా డబ్బులు నాకు తీసుకురాపో అని భార్యను బయటకు గెంటేశాడు. అయినా సరే ఆమె మాట వినక పోయే సరికి తలాక్ చెప్పి పంపించేశాడు. దాంతో బాధిత మహిళ కలెక్టర్ ను కలిసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.