రాజధాని కేసులపై త్రిసభ్య కమిటీ… మెుదటి నుంచి విచారణ
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధానిపై కేసుల వ్యవహారం మళ్లీ మెుదటికొచ్చింది. అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదన్న అంశంపై వేసిన పిటీషన్లను మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. అమరావతి రైతులు, ఇతర పార్టీలు రాజధానిని తరలించొద్దంటూ హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. […]
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధానిపై కేసుల వ్యవహారం మళ్లీ మెుదటికొచ్చింది. అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదన్న అంశంపై వేసిన పిటీషన్లను మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. అమరావతి రైతులు, ఇతర పార్టీలు రాజధానిని తరలించొద్దంటూ హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.
జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అయితే కేసుల విచారణకు షెడ్యూల్ ఖారారు చేయాలనే అంశంపై శుక్రవారం ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్, ఇటు రైతుల తరపున వాదించే న్యాయవాదులతో చర్చించారు. ఇకపోతే గతంలో ఇరువాదనలు పూర్తైన తరుణంలో సీజే మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్ధమైంది.