‘సాయంత్రం వరకూ కోర్టులోనే కూర్చోవాలి‘
దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష విధించింది. సాయంత్రం వరకూ కోర్టులోనే కూర్చోవాలని, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే వారంరోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా హైకోర్టు తేల్చింది. డిసెంబర్ 31వ తేదీన కోర్టుకు హాజరుకావాలన్న ఆదేశాలతో.. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టుకు హాజరయ్యారు. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష విధించింది. సాయంత్రం వరకూ కోర్టులోనే కూర్చోవాలని, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే వారంరోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా హైకోర్టు తేల్చింది. డిసెంబర్ 31వ తేదీన కోర్టుకు హాజరుకావాలన్న ఆదేశాలతో.. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టుకు హాజరయ్యారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కోర్టు సమయం ముగిసేవరకు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది.