ప్రభుత్వానికి, వైజాగ్ పోలీసులకు.. హైకోర్టు షాక్
దిశ, ఏపీ బ్యూరో: నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఎనస్తీషియా వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను వైజాగ్‌లో పోలీసులు మద్యం తాగి దుర్బాషలాడాడన్న కారణంతో అత్యంత హేయమైన రీతిలో అర్ధనగ్నంగా చేతులు వెనక్కి కట్టి, కొట్టి, దుర్భాషలాడుతూ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కేజీహెచ్ వైద్యుల సూచనలతో మెంటల్ ఆస్పత్రికి తరలించిన సంగతీ తెలిసిందే. దీనిపై టీడీపీ నేత అనిత లెటర్‌ను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసిన హైకోర్టు..విశాఖ మెజిస్ట్రేట్‌ను అతని వాంగ్మూలం నమోదు చేయాలని చెబుతూ, […]
దిశ, ఏపీ బ్యూరో: నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఎనస్తీషియా వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను వైజాగ్‌లో పోలీసులు మద్యం తాగి దుర్బాషలాడాడన్న కారణంతో అత్యంత హేయమైన రీతిలో అర్ధనగ్నంగా చేతులు వెనక్కి కట్టి, కొట్టి, దుర్భాషలాడుతూ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కేజీహెచ్ వైద్యుల సూచనలతో మెంటల్ ఆస్పత్రికి తరలించిన సంగతీ తెలిసిందే. దీనిపై టీడీపీ నేత అనిత లెటర్‌ను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసిన హైకోర్టు..విశాఖ మెజిస్ట్రేట్‌ను అతని వాంగ్మూలం నమోదు చేయాలని చెబుతూ, ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీనికి కారణం.. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై గాయాలు లేవని తెలిపిందని, మెజిస్ట్రేట్ నివేదికలో సుధాకర్ శరీరంపై గాయాలున్నాయని, అంతే కాకుండా సుధాకర్‌పై దాడి వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని చెప్పింది. అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. వైజాగ్ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.