నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రత్యేక స్థానం కల్పించిన నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.6 కోట్ల నజరానా ప్రకటిస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి […]

Update: 2021-08-07 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రత్యేక స్థానం కల్పించిన నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.6 కోట్ల నజరానా ప్రకటిస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా నీరజ్ సరికొత్త చరిత్రను లిఖించాడు. దీంతో అతనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా.. పలువురు ప్రముఖుల నుంచి నజరానాలు కూడా వెల్లవెత్తుతున్నాయి.

Tags:    

Similar News