మెదక్ జిల్లాలో పెను ప్రకంపనలు రేపుతున్న హరీష్ వ్యవహారం

దిశ ప్రతినిధి, మెదక్ : అయ్యో హరీషన్న, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేశావు. ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చిందన్న ముందుండి ఆదుకున్నావు. ప్రస్తుతం నీవే ఇరకాటంలో చిక్కుకున్నావా అంటూ జిల్లా ప్రజలు, పలు పార్టీల నాయకులు జోరుగా గుసగుసలాడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, హరీశ్ రావు పై చేసిన కామెంట్లు కాకా పుట్టిస్తున్నాయి. గత కొద్దికాలంగా చూస్తున్న పరిణామలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిన్నటి రేవంత్ రెడ్డి మాటలపై జిల్లా వ్యాప్తంగా […]

Update: 2021-10-19 03:07 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : అయ్యో హరీషన్న, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేశావు. ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చిందన్న ముందుండి ఆదుకున్నావు. ప్రస్తుతం నీవే ఇరకాటంలో చిక్కుకున్నావా అంటూ జిల్లా ప్రజలు, పలు పార్టీల నాయకులు జోరుగా గుసగుసలాడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, హరీశ్ రావు పై చేసిన కామెంట్లు కాకా పుట్టిస్తున్నాయి. గత కొద్దికాలంగా చూస్తున్న పరిణామలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిన్నటి రేవంత్ రెడ్డి మాటలపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చలు మొదలయ్యాయి.

పలుమార్లు పరాభవం ..

టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి హరీశ్ రావుకు పలు మార్లు పరాభవం ఎదురైంది. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హరీశ్ రావును కాస్త పక్కన పెడుతూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీశ్ రావు చేసిన కృషికి ఫలితం దక్కలేదు. దీనిపై గతంలో అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా, కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది గమనించిన సీఎం కేసీఆర్ మంత్రిపదవి ఇచ్చారు. ఎలాంటి పవర్ లేని ఆర్థిక శాఖ కట్టబెట్టడంతో హరీశ్ కు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రం మొత్తం పర్యటించిన మంత్రి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం మినహా మరే పని ఉండటం లేదు.

ముందు నొయ్యి వెనుక గొయ్యి..
హుజురాబాద్ ఉప ఎన్నిక ఏమోగానీ, హరీశ్ రావు పరిస్థితి మాత్రం ముందు నొయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ఖాతాలోకి, ఓడితే దుబ్బాక మాదిరి హరీశ్ ఖాతాలోకి చేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ తన ఓటమిని ఒప్పుకుంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం చాలా చిన్నదంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నిజానికి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలి. కానీ తన బావ హరీశ్ రావును పార్టీ నుండి వెళ్లేగొట్టే ప్రయత్నంలోనే హుజురాబాద్ కి ఇంఛార్జీగా వేశారని హరీశ్ రావు అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ హుజురాబాద్ లో పర్యటించకపోవడం కూడా ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది.

కాకా పుట్టిస్తున్న రేవంత్ మాటలు..
తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు పై చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈటలకు పట్టిన గతే హరీశ్ రావుకు పడుతుందని, హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత హరీశ్ రావు పార్టీ మారడం పక్కా అంటూ రేవంత్ మాట్లాడారు. ఇప్పుడు దీనిపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. హరీశ్ రావు పని ఇక అయిపోయిందంటూ ఆ పార్టీ నేతలు ముచ్చటిస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ హరీశ్ రావుకు పార్టీలో సరైన గుర్తింపు లేని మాట వాస్తవమే, ఇక మేము కూడా హరీశ్ రావు ఎక్కడ ఉంటే తాము అక్కడే ఉంటామంటూ హరీశ్ రావుపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందనేది మాత్రం వాస్తవం. ఇక రేవంత్ రెడ్డి మాటలు నిజమేనా కాదా అని తెలియాలంటే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News