పంట నష్టాన్ని 29న అందిస్తాం : కన్నబాబు

దిశ,వెబ్‌డెస్క్: గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి కన్నబాబు అన్నారు. నివర్ తుఫాన్ పంట నష్టాన్ని రైతులకు 29న ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. నష్ట పరిహారం నమోదుకు రేపు సాయంత్రం వరకు రైతులకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. 12.11 లక్షల ఎకరాల్లో నివర్ తుఫాన్ వల్ల నష్టం సంభవించిందని మంత్రి వెల్లడించారు. 8.34 లక్షల రైతులకు రూ.646 కోట్ల పంట నష్టం నిధులను ఇస్తున్నట్టు వివరించారు. లక్షా 15వేల క్వింటాళ్ల విత్తనాలను […]

Update: 2020-12-23 11:15 GMT

దిశ,వెబ్‌డెస్క్: గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి కన్నబాబు అన్నారు. నివర్ తుఫాన్ పంట నష్టాన్ని రైతులకు 29న ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. నష్ట పరిహారం నమోదుకు రేపు సాయంత్రం వరకు రైతులకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. 12.11 లక్షల ఎకరాల్లో నివర్ తుఫాన్ వల్ల నష్టం సంభవించిందని మంత్రి వెల్లడించారు. 8.34 లక్షల రైతులకు రూ.646 కోట్ల పంట నష్టం నిధులను ఇస్తున్నట్టు వివరించారు. లక్షా 15వేల క్వింటాళ్ల విత్తనాలను కూడా రైతులకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రాప్‌లో నమోదైన రైతులకు నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు. టీడీపీకి రైతులంటే అమరావతి రైతులేనని విమర్శించారు.

Tags:    

Similar News