ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు, ఇక 5 వేల […]

Update: 2021-01-26 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు, ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు అందిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో జారీ చేసింది.

Tags:    

Similar News