పరిహారంపై పట్టింపేదీ..!

దిశ, తెలంగాణబ్యూరో: ‘వరదలతో నష్టపోయిన బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తాం. ఈ పరిహారమే కాకుండా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.లక్ష ఇస్తామంటూ’ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతేకాదు.. వరద బాధితులు 4లక్షల మంది ఉండగా.., 38వేల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయంటూ లెక్కలు సైతం చెప్పారు. అయితే తక్షణ సాయం అధికార పార్టీ నాయకుల పంపకాలుగా మారిపోయాయని విమర్శలు వెల్లువెత్తగా..అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇక వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇచ్చే […]

Update: 2020-11-04 18:30 GMT

దిశ, తెలంగాణబ్యూరో: ‘వరదలతో నష్టపోయిన బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తాం. ఈ పరిహారమే కాకుండా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.లక్ష ఇస్తామంటూ’ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతేకాదు.. వరద బాధితులు 4లక్షల మంది ఉండగా.., 38వేల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయంటూ లెక్కలు సైతం చెప్పారు. అయితే తక్షణ సాయం అధికార పార్టీ నాయకుల పంపకాలుగా మారిపోయాయని విమర్శలు వెల్లువెత్తగా..అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇక వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇచ్చే పనులు ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇల్లుకు పరిహారం తర్వాతగానీ ఇప్పుడు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇస్తామన్న రూ.10వేల కోసం బాధితులు జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

వరదల కారణంగా నాలుగు లక్షల కుటుంబాలు నష్టపోయాయని, వారికి రూ.10 వేల తక్షణ సాయాన్ని అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే తక్షణ సాయంతో సంబంధం లేకుండా ఇండ్లు ధ్వంసమైన, తీవ్రంగా నష్టపోయిన వారికి సైతం పరిహారాన్ని అందిస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 38 వేల కుటుంబాలు తీవ్రంగా నష్టోయినట్టు జీహెచ్ఎంసీ వరదల అనంతరం ప్రకటించింది. ఆయా కుటుంబాల ఇళ్లు ప్రమాదకర స్థితిలో దెబ్బతినడంతో పాటు వరద అనంతరం సాధారణ స్థితికి చేరుకోలేని విధంగా ఉన్నవారిని ఆదుకుంటామని తెలిపింది. అయితే ఆ ఇళ్లకు ఏ మేరకు నష్టం జరిగిందనేది ఇప్పటి వరకూ గుర్తించలేదని బాధితులు వాపోతున్నారు. చాంద్రాయణగుట్ట, టోలీచౌకీ, నదీం కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం బస్తీల్లోని పేదల నివాసాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్ బ్రిడ్జికి ఇరువైపులా కిలోమీటర్ మేర రెండు రోజుల పాటు వరద ప్రవాహామే ఉండటంతో ఇంట్లోని వంట సామగ్రి, బట్టలు, దుప్పట్లు, గుడిసెలు అన్నీ వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాల ప్రజల ఇప్పటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరదల తక్షణ సాయాన్ని ప్రకటించి సుమారు 20 రోజులకు చేరుకుంది. నేటికీ ఇళ్లు ధ్వంసమైన కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం పట్టాలెక్కలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బాధితులు

పరిహారం అందలేదని ముంపు ప్రాంతాల్లోని బాధితులు రోజూ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వరద సాయం ఇవ్వాలంటూ మంగళవారం పాతబస్తీకి చెందిన మహిళలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బుధవారం యాక‌త్‌పురా నుంచి సాయం డబ్బుల కోసం చేరుకున్నారు. కార్యాలయంలో డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో ఇక్కడికి వచ్చినట్లు మహిళలు తెలిపారు. పరిహారం అందించకుండా అధికారులు ఇష్టారీతిలో తిప్పుకుంటున్నారని వారు వాపోయారు. వరద తక్షణ సాయమంటూనే వారాలు గడువు తీసుకుంటున్న నేపథ్యంలో ముంపు బాధితుల్లో విశ్వాసం తగ్గుతోంది. పరిహారం అందుతుందన్న భరోసాను బాధితుల్లో కల్పించడంలో జీహెచ్ఎంసీ విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్షేత్రస్థాయి పర్యటనలు లేకుండానే ?

జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణ సాయం, ఇతర పునరావాస సహాయక చర్యలను చేపట్టేందుకు ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నారంటే అధికారుల వద్ద సమాచారం లేదు. తక్షణ సాయం పేరుతో నేరుగా చేతులకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజలు వెంటనే తమ ఆహార సమస్యలను అధిగమిస్తారని భావించినా.. ఆ నిధులు దారి మళ్లినట్లు తేలిపోయింది. 4లక్షల మందికి తక్షణ సాయం అందించాలని, 38 వేల కుటుంబాలను పూర్తిస్థాయి బాధితులుగా ఎలా నిర్ధారించారనే విషయాలకు సమాధానం లేదు. వర్షాలు కురిసిన వారం రోజుల వరకూ వరద నీటిలోనే కాలనీలు ఉన్నాయి. కనీసం తాగు నీళ్లు, అన్నం ఇచ్చేందుకు కూడా ఒక్కరూ కనిపించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ ఏ స్థాయిలో నష్టం వాటిల్లిందో, వెంటనే ఆదుకోవాల్సిన బాధితులెవరూ గుర్తించే పనులేవీ జీహెచ్ఎంసీ చేపట్టలేకపోయింది. కేటీఆర్ ప్రకటించిన సందర్భంలోనూ అంచనాగానే పేర్కొన్నారు. అయితే మంత్రి చెప్పిన 4 లక్షల మందికి మాత్రం దాదాపు నిధులను అందించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమం పూర్తి చేయడం గమనార్హం. అయితే పూర్తిస్థాయిలో ఇండ్లు ధ్వంసమైన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే అవసరమని, ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తమ వద్దకు రాలేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహిళలు చెబుతున్నారు.

అక్రమాలపై విచారణ జరపాలి

వరద సాయం అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముంపు బాధితులకు అందాల్సిన పరిహారాన్ని టీఆర్ఎస్ నాయకులు గద్దల్లా దోచుకుతిన్నారని ఆరోపణలు చేసింది. బాధితులను గుర్తించి వారికి పరిహారం అందించడమేగాక, వరద సహాయ నిధులను పక్కదారి పట్టించిన అధికారులు, కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కమిషనర్ లోకేశ్ కుమార్‌ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు కమిషనర్​కు పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోరారు. వరద బాధితుల ఎంపికలో ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని అనుసరించారో, 3.9 లక్షల మంది వరదలతో నష్టపోయారని ఏ విధంగా అంచనా వేశారో తెలపాలన్నారు. టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో నిధులను పెట్టేందుకు ఏ నిబంధనలు అనుమతిస్తున్నాయో, సాయం పంపిణీ కోసం విడుదల చేయాల్సిన గైడ్‌లైన్స్ ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికే పంచామని చెబుతున్న రూ.380 కోట్లు ఇచ్చిన వారి వివరాలు, ఇక ముందు ఇచ్చే వారి వివరాలను తమకు ఇవ్వాలని కోరింది. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, నాయకులు ఫిరోజ్ ఖాన్, షకీల్, నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News