CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసులో కోర్ట్ కీలక తీర్పు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద దాఖలైన పరువునష్టం దావా కేసు(defamation case)లో కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-28 16:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద దాఖలైన పరువునష్టం దావా కేసు(defamation case)లో కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో బీజేపీ పార్టీ(BJP Party) మీద తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపిస్తూ.. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు(Kasam Venkateshwarlu) కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ కేసుపై నాంపల్లి కోర్ట్(Nampally Court) నేడు విచారణ చేపట్టింది. బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీకి, మోడీకి పరువునష్టం కలిగించేలా ఉన్నాయని.. రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల అనంతరం.. కేసును డిసెంబర్ 11కు కోర్ట్ వాయిదా వేసింది.

Tags:    

Similar News