గోదావరి తీరం చెత్తకు నిలయం
దిశ,బాసర : దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర క్షేత్రంలో పవిత్రమైనటువంటి గోదావరి నది ఉంది. చెప్పడానికి పవిత్ర గోదావరి గానీ, చూడటానికి అపవిత్రం గా ఉంది. చుట్టూ చెత్త చెదారంతో నిండి పోయింది. దీనితో గోదావరి నదికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి సైతం భక్తులు వస్తుంటారు. వచ్చే భక్తులకు స్నానాలు చేయడానికి వీలు లేకుండా,చెత్త బురద తో నిండి పోయింది. తక్షణమే […]
దిశ,బాసర : దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర క్షేత్రంలో పవిత్రమైనటువంటి గోదావరి నది ఉంది. చెప్పడానికి పవిత్ర గోదావరి గానీ, చూడటానికి అపవిత్రం గా ఉంది. చుట్టూ చెత్త చెదారంతో నిండి పోయింది. దీనితో గోదావరి నదికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి సైతం భక్తులు వస్తుంటారు. వచ్చే భక్తులకు స్నానాలు చేయడానికి వీలు లేకుండా,చెత్త బురద తో నిండి పోయింది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, గోదారి గట్టు శుభ్రపరచాలని, లేదంటే ఉపాధి హామీ పథకం కింద ఉపాధిహామీ కూలీల తో నైనా పని చేయించాలని భక్తులు కోరుతున్నారు.