విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ సమీపంలో ( రేచిని రోడ్, రైల్వే స్టేషన్ల మధ్య) మంగళవారం సాయంత్రం గూడ్స్ రైలు బోగిలు విడిపోయాయి.

Update: 2024-12-17 14:32 GMT

దిశ, తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ సమీపంలో ( రేచిని రోడ్, రైల్వే స్టేషన్ల మధ్య) మంగళవారం సాయంత్రం గూడ్స్ రైలు బోగిలు విడిపోయాయి. కాగజ్ నగర్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు బోగీకి బోగీకి మధ్యలో ఉండే కప్లింగ్ ఊడిపోవటంతో రైలు బోగిలు విడిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమతమై మరమ్మతులు చేసి గూడ్స్ రైలును పంపించారు. 


Similar News