నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

Update: 2024-12-17 14:23 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్, కాగజ్ నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల కోసం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సేకరించిన వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా యాప్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

     ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించా రు. అంతకుముందు కలెక్టరేట్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ దత్తారాంలతో కలిసి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం జిల్లాలోని 105 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.6 కోట్ల 89 లక్షల విలువైన చెక్కును అందజేశారు.


Similar News