తిరుపతిపై ఆందోళనలో చిరంజీవి.. అభిమానులకు విజ్ఞప్తి
దిశ, ఏపీ బ్యూరో: భారీ వర్షాలతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను సైతం ముంచేస్తున్నాయి. దీంతో తిరుపతి చిగురుటాకులా వణికిపోతుంది. తిరుపతి, తిరుమలలోని నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం చూస్తుంటే తనకెంతో బాధగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన […]
దిశ, ఏపీ బ్యూరో: భారీ వర్షాలతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను సైతం ముంచేస్తున్నాయి. దీంతో తిరుపతి చిగురుటాకులా వణికిపోతుంది. తిరుపతి, తిరుమలలోని నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం చూస్తుంటే తనకెంతో బాధగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.